
NTR30 పోస్ట్ పోన్

కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ తలపెట్టిన చిత్రం షూటింగ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. కాకపోతే, ఈ సారి నందమూరి కుటుంబం లో జరిగిన విషాద సంఘటన వల్ల #NTR30 షూటింగ్ పోస్ట్ ఫోన్ అయింది. నందమూరి తారకరత్న అకాల మరణం జరగడం వల్ల ఫిబ్రవరి 24 న ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ పోస్టుపోన్ చేశారని, చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే కొత్త తేదీ త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఇది ఎన్టీఆర్ కు రెండవ చిత్రం. వారి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయినా విషయం అందరికి తెలిసినదే. ఈ #NTR30 సినిమా ను యువసుధ ఆర్ట్స్ మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.