

“నాంది” చిత్రం తో సూపర్ హిట్ ఇచ్చిన అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలయికలో వస్తున్న మరో చిత్రం ‘ఉగ్రం’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఉగ్రమ్ టీజర్‌ను ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్లో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు.
ఈ చిత్రం లో అల్లరి నరేష్ రెగ్యులర్ కు భిన్నంగా ఒక సీరియస్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. మంచి ఫైట్స్ తో పాటు ఒక పొలిటిషన్ కు పంచ్ డైలాగ్ తో అల్లరి నరేష్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. Get ready to witness the wrath అనే కొటేషన్ తో ముగుస్తున్న ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచుతోంది.
టీజర్ ను షేర్ చేస్తూ అల్లరి నరేష్ ”Re-inventing myself like I have never done before…presenting to you the teaser of #Ugram. Thank you @chay_akkineni for launching it.” అని రాసాడు.
ఈ చిత్రం లో అల్లరి నరేష్‌తో పాటు కౌశిక్ మహత, మర్నా, మణికంఠ వారణాసి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం, సిద్దార్థ్ జాదవ్ సినిమాటోగ్రఫీ మరియు చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సమకూరుస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది మరియు సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.