

అక్షయ్ కుమార్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. తన అభిమానులకు అసాధారణమైన నివాళిగా అతను అతను ఎవరు ఊహించలేని పని చేసాడు. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 24 ఫిబ్రవరి 2023న విడుదల కానున్న తన రాబోయే చిత్రం సెల్ఫీ ప్రమోషన్ కోసం మహారాష్ట్రలోని ముంబైలో అభిమానులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్‌లో మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫ్ (సెల్ఫీలు) తీసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను బద్దలు కొట్టారు. విధ్వంసక విన్యాసాలు మరియు విలక్షణమైన రికార్డులకు పేరుగాంచిన సూపర్ స్టార్ ఇప్పుడు 184 సెల్ఫీలతో ఈ ప్రత్యేక ఫీట్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ హోల్డర్‌గా నిలిచారు.
22 జనవరి 2018న కార్నివాల్ డ్రీమ్ క్రూజ్ షిప్లో జేమ్స్ స్మిత్ (USA) మూడు నిమిషాల్లో తీసిన 168 సెల్ఫ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫ్‌ల (సెల్ఫీలు) ప్రపంచ రికార్డును ఇప్పుడు అక్షయ్బ కుమార్ బద్దలు కొట్టారు. దీనికి ముందు, 2015లో గ్లోబల్ ఐకాన్ మరియు హాలీవుడ్ నటుడు లండన్‌లోని శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్‌లో మూడు నిమిషాల్లో 105 సెల్ఫ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫ్‌లతో (సెల్ఫీలు) డ్వేన్ జాన్సన్ ఈ రికార్డును కలిగి ఉన్నాడు.
నటుడు అక్షయ్ కుమార్ ఈ ప్రత్యేకమైన రికార్డును బద్దలు కొట్టడం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డ్‌ను బద్దలు కొట్టడం మరియు ఈ క్షణాన్ని నా అభిమానులతో పంచుకోవడం పట్ల నేను ఆనందిస్తున్నాను! నేను నా జీవితం లో ఇంత వరకు సాధించినది ఏదైనా ఉందంటే మరియు ఈ క్షణంలో నా స్థానం కేవలం నా అభిమానుల బేషరతు ప్రేమ మరియు మద్దతు కారణంగానే సాధించాను. నా మొత్తం కెరీర్లో నాకు మరియు నా పనికి వారు నాకు ఇచ్చిన అండకు నేను ఈ రోజు ఇలా చెయ్యడం సరైన నివాళి అని భావిస్తున్నాను”.
మొదటిసారిగా ఇమ్రాన్ హష్మీతో అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సెల్ఫీ” ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదలకు సిద్ధంగా ఉంది.