

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో నిర్మించబడుతున్న వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది . హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో ఈరోజు చిత్రీకరణ ప్రారంభమైంది. సముత్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో సాయి తేజ్‌కి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
తమిళ చిత్ర సీమ లో బ్లాక్ బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకున్న వినోదయ సితం చిత్రానికి తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందించారు. ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 20 రోజుల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ రోజు ముహూర్తం చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాల్సి ఉంది.