

ఈ రోజు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర హోమ్ శాఖ పర్మిషన్ ఇవ్వడం తో ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ తప్పదు అనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో మనీష్ సిసోడియా పేరు ను A1 గా దాఖలు చెయ్యడం తో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ తాను అరెస్టు చేయబడతాననే భయం లేదని, ఎలాంటి ప్రశ్నల నుండి పారిపోనని, అయితే అది “ఢిల్లీ ప్రజలకు నష్టాన్ని కలిగించేది”
గా ఉండకూడదని అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయదలచిన కొత్త లిక్కర్ పాలసీ లో అవినీతి జరిగింది అన్న ఆరోపణల పై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ భాగంగా సిబిఐ మనీష్ సిసోడియా ను పిలిచింది. అయితే తాను బడ్జెట్ తయారు చెయ్యడం లో బిజీ గా ఉన్నాను అని ఆయన సమయం కోరారు.
రాజకీయంగా తమను ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్రలో భాగంగా తనపై కేసు పెట్టారని, ఈ నోటీసు సిబిఐ తనకు కేంద్రంలోని పెద్దల ఆదేశాల పై పంపారు అని మనీష్ సిసోడియా ఆరోపించారు.
ఇప్పటికే ఈ స్కాం లో భాగంగా చాలా మంది ని సిబిఐ, ఈడీ అరెస్ట్ చేశాయి. ఇక మనీష్ సిసోడియా అరెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉంటుందా లేక ముందే ఉంటుందా అన్నదే ప్రశ్న.