

సెలబ్రిటీలు, వారి జీవితాల్లో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇది ఇప్పుడే, ఈ సోషల్ మీడియా సమయంలో కాదు, ఎప్పటి నుండో ఉండేది. అందుకు తగ్గట్టుగా సమయానుకూలంగా గాసిప్ మ్యాగజైన్ లు ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యం ఏలుతున్న సమయంలో ఈ పిచ్చి ఇంకా ఎక్కువ అయింది. కాకపోతే, పాపారాజి గీత దాటి తన ఇంటి బాల్కనీ లోకి తొంగి చూసి ప్రైవేట్ జీవితంలో ఫోటో తీసింది అని అలియా భట్ పోస్ట్ పెట్టడం తో ఈ చర్చ ఇంకా పెద్దది అయింది.
బాలీవుడ్ నటి అలియా భట్ మంగళవారం తన ఇంటిలో ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా ఫోటోగ్రాఫర్లు తన ఫోటోలను క్లిక్ చేయడంతో ‘గోప్యతపై దాడి’ చేశారని మీడియా ను విమర్శిస్తూ, ముంబై పోలీసులను ట్యాగ్ చేసి పోస్ట్ చేసింది.
ఆమె ఇలా రాశారు ” “Are you kidding me? I was at my house having a perfectly normal afternoon sitting in my living room when I felt something watching me…. I looked up and saw two men on the terrace of my neighbouring building with a camera right at me! In what world is this okay and allowed?”
ముంబై పోలీస్ లను టాగ్ చేస్తూ ఇలా రాశారు “This is a gross invasion of someone’s privacy and it’s safe to say all lines were crossed dat. @mumbaipolice.”
ఈ సంఘటనలో అలియా కు బాలీవుడ్ ప్రముఖుల మద్దతు లభిస్తోంది.
హాలీవుడ్ లో ఈ పాపారాజి బెడద ఎప్పటి నుండో ఉంటోంది. ప్రముఖుల దీని గురించి ఎన్నో సార్లు తమ ఆవేదన వ్యక్తం చేసినా ఇది తగ్గలేదు. నిజానికి, ప్రిన్సెస్ డయానా ఆక్సిడెంట్ అయి మరణించినప్పుడు కూడా పాపారాజి పై చాలా చర్చ జరిగింది. ఇలాంటి సమస్య ఇప్పుడు మన దేశంలో ఎదురుకావడం గర్హనీయం.
సెలెబ్రిటీలు బయట ఉన్నప్పుడు వారిని కవర్ చేయాలనుకోవడం, న్యూస్ అందరి కంటే ముందే ఇవ్వాలనుకోవడం సహజమే అయినా, వారి ఇంట్లోకి తొంగి చూసి ప్రైవేట్ జీవితంలో జోక్యం చేసుకోవడం మాత్రం గీత దాటడమే. దీన్ని అందరు ఖండించాలి మరియు ఇలా చేసిన వారిపై బలమైన చట్టాల్ని ప్రయోగించాలి. అప్పుడే ఈ సమస్య ను మొదలులోనే తుంచివేయగలుగుతాము.