

గత వారం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియం లో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చి విజయాలను అందించిన ఇళయరాజా చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో పెర్ఫర్మ్ చేస్తుండటంతో ఆయన అభిమానులు ఉద్వేగానికి గురిఅయ్యారు.
కాకపోతే, ఈ కన్సర్ట్ తర్వాత కొన్ని తెలుగు వెబ్సైట్లు ఇళయరాజా కన్సర్ట్ ప్లాప్ అయిందని, బాలు గారు లేని లోటు బాగా కనపడిందని, పాటల సెలక్షన్ బాగా లేదని విమర్శలతో కూడిన ఆర్టికల్స్ ప్రచురించాయి.
కాకపోతే, కన్సర్ట్ అటెండ్ అయిన వారి సమాచారం ప్రకారం నాలుగు గంటలు పనిగా సాగిన ఈ లైవ్ కన్సర్ట్ లో దాదాపు 35 పాటలు ఇళయరాజా సంగీత సారధ్యంలో గాయనీగాయకులు పాడారు అని ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారని తెలుస్తోంది.
కాకపోతే, కొన్ని వెబ్సైట్లు మాత్రం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు లేని లోటు కనిపించిందని ప్రేక్షకులు డిస్సపాయింట్ అయ్యారని రాశాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు ఇళయరాజాల జంట గురించి, వారు పాడిన అద్భుతమైన పాటల గురించి మరియు విజయాల గురించి అందరికి తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని రీప్లేస్ చేసే గాయకుడు లేడని కూడా అందరికి తెలుసు. అలాంటప్పుడు, బాలు లేని రాజా కన్సర్ట్ బాలేదు అనడం ఏంటి? మరి అలాంటప్పుడు ఏ కన్సర్ట్ లో ఎవ్వరు బాలు పాటలు పాడకూడదా?? ఇళయరాజా ఇక కాన్సర్ట్లు చెయ్యడం మానుకోవాలా? ప్రేక్షకుల సమాచారం ప్రకారం మనో, కార్తీక్, చరణ్ బాలు గారి పాటలను సాధ్యమైనంత బాగా పాడారనే తెలిపారు.
మరి, అలాంటప్పుడు ఈ వెబ్ సైట్లకు ఇళయరాజా కన్సర్ట్ పై ఇంత ద్వేషం దేనికి? ఈ విషయం పై మేము సినిమా వర్గాలు మరియు ఈవెంట్ ఆర్గనైజర్లతో విచారిస్తే తెలిసిందేంటంటే ఈ సారి లైవ్ కన్సర్ట్ కు వెబ్ మీడియా వర్గాలకు ఎలాంటి ఫ్రీ పాస్ లు ఇవ్వలేదని, అందుకే ఈ వెబ్సైటు లు వ్యతికేరంగా రాస్తున్నాయని తెలిసింది.
సినిమా ఈవెంట్లకు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ లకు, ఇంటర్వ్యూ లకు ఇన్వెలోప్లు అందుకోడం అలవాటైన వెబ్ మీడియా మరి ఫ్రీ పాసులు అందకుంటే వ్యతిరేకంగా రాయడం సహజమే కదా. కాకపోతే, ఇళయరాజా లాంటి లెజెండ్ కన్సర్ట్ పై ఈ ద్వేషం తో కూడిన రాతలు చిమ్మడమే సంగీత అభిమానులకు నచ్చడం లేదు.