

సంవత్సరానికి ఒక సినిమా, రెండేళ్లకు ఒక సినిమా రిలీజ్లు గలిగిన హీరోలు ఉన్న ఈ రోజుల్లో మాస్ మహారాజ్ రవి తేజ కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు, పని చేస్తున్నాడు. ధమాకా, వాల్టేర్ వీరయ్య సక్సెస్ తో ఊపు మీదున్న రవి తేజ ఇప్పుడు రావణాసుర షూటింగ్ పూర్తి చేసి తన తర్వాతి సినిమాల పై దృష్టి పెట్టాడు.
సినిమాలు సైన్ చెయ్యడం లో క్రితం సంవత్సరం దూకుడు చూపించిన మాస్ మహారాజ్ ఈ సంవత్సరం కనీసం రెండు రెలీజ్లు రెడీ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన “రావణాసుర” సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతుండగా, వంశీ కృష్ణ దర్శకత్వం లో నటిస్తున్న “టైగర్ నాగేశ్వర్ రావు” సినిమాను ఆగష్టు లో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య లో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.
ఒక సమయం లో వరుస పరాజయాలతో స్ట్రగుల్ అయిన మాస్ మహారాజ్ తనను తాను రీ డిస్కవర్ చేసుకొని, పని మీద పూర్తి ధ్యాస పెట్టి సినిమా తర్వాత సినిమా చేస్తూ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చి విజయాలను రుచి చూస్తున్న వైనం తక్కిన హీరో లకు ఒక ఉదాహరణ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
/