Spread the love

తెలుగు చిత్ర సీమ లో ఉస్తాద్ ల సీజన్లో నడుస్తున్నట్లుంది. పూరి జగన్నాధ్- రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పాపులర్ అయినా ఉస్తాద్ అనే పదం ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి బాగా నచ్చిన పదం లా మారింది.

పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో నిర్మిస్తున్న ” భవదీయుడు భగత్ సింగ్” చిత్రం సబ్జెక్టు మారడం తో టైటిల్ ను “ఉస్తాద్ భగత్ సింగ్” గా మార్చి అనౌన్స్ చేశారు. సరే అనుకునే లోగా, కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరో గా ” ఉస్తాద్” సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

ఓకే అనుకునేలోగా మరో న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో వ్యాపించింది. అదేంటంటే పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ మూవీ రామ్ పోతినేని తో ” ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ” అనే టైటిల్ తో సినిమా తియ్యనున్నారని. ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకున్న ఈ జంట కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా ఫిలిం లవర్స్ కి ఒక ఫీస్ట్ లాంటిదే. ఈ వార్త నిజం అయితే మన ఫిలిం ఇండస్ట్రీ కి ” ఉస్తాద్” పై ఉన్న ప్రేమ కు మనం సలాం కొట్టాల్సిందే.