సినిమా హీరోలకు అభిమానులు ఒక వైపు వరం కాగా, మరో వైపు శాపం గా పరిణమిస్తారు. వారి మితిమీరిన అభిమానం వలన హీరోలకు ఇబ్బందులు కలగడం మనకు ఎన్నో సందర్భాల్లో తెలుసు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరో సారి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు ఎదురైంది.
ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా “మన్నత్” లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బయటి గోడను దూకడం ద్వారా మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగులను సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో, 20 మరియు 22 సంవత్సరాల మధ్య వయస్సు గల ఈ వ్యక్తులు, తాము గుజరాత్ నుండి పఠాన్
స్టార్‌ను కలిసేందుకు వచ్చామని తెలిపారు. వారిపై భారత శిక్షాస్మృతి (IPC) కింద అతిక్రమణ మరియు ఇతర సంబంధిత నేరాల కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ జరుగుతోంది.
బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టిన పఠాన్
విజయంతో షారూఖ్ ఖాన్ దూసుకుపోతున్నాడు.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల మార్కును చేరుకుంది. జాన్ అబ్రహం మరియు దీపికా పదుకొనే ఈ చిత్రంలో నటించారు. షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రాలైన జవాన్
మరియు డుంకీ
కోసం సిద్ధమవుతున్నాడు. అతను అతిధి పాత్రలో నటిస్తున్న యష్ రాజ్ ఫిలింస్ యొక్క ‘టైగర్ 3’ షూటింగ్‌ను కూడా ఏప్రిల్ 2023లో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ చిత్రం 2023 దీపావళికి థియేటర్లలోకి విడుదల అవుతుందని భావిస్తున్నారు.
బాలీవుడ్ సినీ తారల ఇంట్లోకి అభిమానులు చొరబడడం ఇదే మొదటిసారి కాదు. ఆగస్ట్ 2016లో, 23 ఏళ్ల వ్యక్తి భద్రతను ఉల్లంఘించి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి జల్సాలోకి ప్రవేశించాడు.