

పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ చిత్రంలో అతిధి పాత్రలో నటించడానికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో షారూఖ్ ఖాన్‌తో విజయ్ సేతుపతి, నయనతార, సన్యా మల్హోత్రా మరియు ప్రియమణి నటిస్తున్నారు. పూణె, ముంబై, హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ షూటింగ్ లో బిజీ గా ఉండటం కారణంగా అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తిరస్కరించాడు అని తెలుస్తోంది. ఈ సమయంలో పుష్ప ది రూల్ పైనే పూర్తయిన ఫోకస్ చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.