

పుష్ప ది రూల్ షూటింగ్ లో బిజీ గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం తర్వాత ఎవరి దర్శకత్వం లో నటిస్తాడు అని అందరు ఆసక్తి చూపిస్తున్న సమయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చేసింది.
పుష్ప ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా సినిమా లో అర్జున్ రెడ్డి తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇది కంఫర్మ్ చేస్తూ టీం ఒక ఫోటో విడుదల చేసింది.
ఈ మధ్యే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ మరియు ఇతర టీం మెంబెర్స్ కి కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపి కంఫర్మ్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ టీ సిరీస్ వారు ” మూడు భారతీయ పవర్‌హౌస్‌లు- నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు సూపర్ స్టార్ అల్లు అర్జున్ మధ్య భారీ కొలాబరేషన్ కోసం సిద్ధంగా ఉండండి ” అని ప్రకటన చేశారు.
ప్రస్తుతం రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా తీస్తున్న సందీప్ వంగా ప్రభాస్ ను దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రం స్పిరిట్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.