
వరుణ్ తేజ్ తదుపరి చిత్రం లో ఆయన సరసన మిస్ యూనివర్స్ మానుషీ చిల్లర్ జత కట్టనుంది. ఈ వార్త ను కంఫర్మ్ చేస్తూ, ఆమెను వెల్కమ్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియో రిలీజ్ చేసింది.
కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హాడా దర్శకత్వం లో వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ తెలుగు- హిందీ ద్విభాషా చిత్రం లో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా, మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ గా నటించనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఏరియల్ ఆక్షన్ థ్రిల్లర్ గా పేర్కొంటున్నారు. ఈ చిత్రం వరుణ్ తేజ్ కు బాలీవుడ్ లో మొదటి చిత్రం కాగా, సామ్రాట్ పృథ్విరాజ్ తో బాలీవుడ్ డెబ్యూ చేసిన మానుషీ చిల్లర్ కు ఇది రెండవ చిత్రం మరియు తెలుగు లో డెబ్యూ మూవీ.
సందీప్ ముద్దా, నంద కుమార్ అబ్బినేని తో పాటు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.