
యూట్యూబ్ ఛానెల్‌లలో “తప్పుదోవ పట్టించే వీడియోలను” అప్లోడ్ చేయడం ద్వారా రెండు కంపెనీల “షేర్ ధరలను మానిప్యులేట్” చేశారనే ఆరోపణలపై సెబీ గురువారం బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ – ఆయన భార్య మారియా గోరెట్టి మరియు 45 ఇతర సంస్థలను సెక్యూరిటీ మార్కెట్ నుండి నిషేధించింది. ఈ నిషేధిత జాబితాలో యూట్యూబర్ మనీష్ మిశ్రా మరియు సాధనా బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లు శ్రేయా గుప్తా, గౌరవ్ గుప్తా, సౌరభ్ గుప్తా, పూజా అగర్వాల్ మరియు వరుణ్ మీడియా కూడా ఉన్నారు.
వాల్యూమ్ క్రియేటర్లుగా సెబీ వర్గీకరించబడిన ఈ నటుడు మరియు అతని భార్య కలిసి తమ పెట్టుబడుల ద్వారా రూ. 66.99 లక్షల లాభాన్ని ఆర్జించారని సెబీ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. వార్సీ రూ.29.43 లక్షలు, గోరెట్టి రూ.37.56 లక్షలు ఆర్జించారు అని తెలిపింది.
ఈ నిషేధం తర్వాత అర్షద్ వార్సీ తన వివరణను ఇస్తూ, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తనకు మరియు తన భార్యకు తెలియదని, ఎందుకంటే వారికి దాని గురించి “సున్నా” పరిజ్ఞానం ఉంది అని చెప్పారు.
తన ట్వీట్లో, ప్రమోటర్లతో పెట్టుబడి పెట్టడానికి ముందు తాను సలహా తీసుకున్నానని, తాము “కష్టపడి సంపాదించిన డబ్బు” కోల్పోయామని వార్సీ చెప్పాడు.
“దయచేసి మీరు వార్తల్లో చదివినవన్నీ నమ్మవద్దు. మరియా మరియు స్టాక్స్ గురించి నాకున్న పరిజ్ఞానం శూన్యం, సలహాలు తీసుకుని శారదాలో పెట్టుబడి పెట్టాను, ఇంకా చాలా మంది లాగానే నేను కూడా డబ్బు కోల్పోయాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
యూట్యూబ్ ఛానెల్‌లలో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ మరియు షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ షేర్లను కొన్ని సంస్థలు ధరల తారుమారు మరియు ఆఫ్‌లోడింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ సెబీకి ఫిర్యాదులు అందడంతో ఈ దర్యాప్తు ప్రారంభించినట్లు ANI నివేదిక తెలిపింది.