
ఇక పై గ్యాప్ ఉండదని, వెంట వెంటనే సినిమాలు తీసి అభిమానులను ఆలరిస్తానని పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. ఒక్క హీరో తో, ఒకే సినిమా తో ఆగిపోయాడు అనే సోషల్ మీడియా కామెంట్స్, కన్సర్న్స్ కు ఆయన నిన్న సమాధానం ఇచ్చారు.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో, వరుణ్ తేజ్ హీరో గా “గడ్డలకొండ గణేష్ ” చిత్రం 2019 లో విడుదల అయినా విషయం తెలిసిందే. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సినిమా కంఫర్మ్ అవడం తో ఆ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు హరీష్ శంకర్. కాకపోతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం వలన మరియు కథ మారడం వల్ల ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారణంగా దర్శకుడు ఒకే హీరో తో ఆగిపోయాడని, ఆయన ఒక్కడే హీరో నా అన్న కామెంట్స్ సోషల్ మీడియా నుండి వెలువడ్డాయి. మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడు ఒక్క సినిమా కోసం ఐదేళ్లు ఆగిపోయాడు, ఈ సమయం లో వేరే సినిమాలు తీసి ముందుకు వెళ్లి ఉండచ్చు అనే కన్సర్న్ కూడా వ్యక్తం అయింది.
ఇకపోతే, హరీష్ శంకర్ ఈ సమయం లో దిల్ రాజు తో కలిసి ఎటిఎం అనే వెబ్ సిరీస్ కు రచన అందించడమే కాకుండా నిర్మించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభ వార్తగా హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.