
ఇప్పటిదాకా హిందీ చిత్ర రంగం లో నెంబర్ 1 సినిమా గా పేరు పొందిన బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డు ను కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బద్దలు కొట్టింది. కాకపోతే, ఈ రికార్డు హిందీ వెర్షన్ కు సంబంధించినది మాత్రమే. అన్ని బాషల కలెక్షన్స్ చూస్తే బాహుబలి 2 ఇండియా లో ఇంకా నెంబర్ 1 సినిమానే.
పఠాన్ సినిమా నిన్నటి కలెక్షన్స్ తో కలిపి హిందీ లో 511 కోట్ల 70 లక్షలు కావడం తో బాహుబలి కలెక్షన్ చేసిన 511 కోట్ల ను దాటి హిందీ లో నెంబర్ 1 స్థానం చేరుకుంది. ఇది హిందీ లోని పేరుగల ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసి అనౌన్స్ చెయ్యగా బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ రికార్డు లు ఉండేది బద్దలు కొట్టడానికి…మా సినిమా రికార్డు షారుఖ్ ఖాన్ సినిమా బద్దలు కొట్టడం సంతోషంగా ఉంది అని జవాబు ఇచ్చారు.

ఇప్పుడు ఇండియా లోని టాప్ 4 సినిమాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి
1 . పఠాన్
2 . బాహుబలి 2
3 . కేజిఫ్ 2
4 . దంగల్